నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రయాణికుల ప్రా ణ రక్షణే మన ప్రధాన బాధ్యత అని, వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే మన లక్ష్యమని నారాయణపేట డిపో మేనేజర్ ఆర్.రామ్మోహన్ అన్నారు. ఈ మేరకు మంగళవా రం ఆర్టీసీ డీపో సమావేశ మందిరంలో ప్రైవేట్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు భద్రత, భరోసా కల్పిస్తూ సురక్షిత ప్రయా ణం అందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. డ్రైవర్లు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రయాణ నియమాలపై పూర్తి అవగాహ న కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రయాణికులు ఎక్కడ ఆపినా గౌరవంతో బస్సును ఎక్కించుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు.
25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: దేవరకద్ర డిగ్రీ కళాశాలలో గెస్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, కామ ర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, అర్థశాస్త్రం, ఇంగ్లిష్, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, తెలుగు, జంతుశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, గురువారంలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు.


