మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

Jul 22 2026 2:11 AM | Updated on Jul 22 2026 2:11 AM

నారాయణపేట: ప్రస్తుత సమాజంలో వివి ధ రూపాల్లో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ సూచించారు. మంగళవారం విలేకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..అమాయకలను లక్ష్యంగా చేసుకు ని కేటుగాళ్లు ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్‌లైన్‌ వ్యాపా రాలు, లక్కీ డ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్నారని తెలిపారు.

ఆశ చూపి.. వసూళ్లు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, సులభంగా రుణం, తక్షణ ఉద్యోగం, లక్కీ డ్రా వంటి ఆశాజనక మాటలతో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు, సోషల్‌ మీడియా పోస్టులు, ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు.

నకిలీ పత్రాలతో మోసాలు

నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు చూ పించి స్థలాలు, ఇళ్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారన్నారున్నారు. ఆస్తుల కొనుగోలు సమయంలో సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించి, అధికారిక ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని సూచించారు.

క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దోపిడీ

సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని డబ్బులు అడగడం, ఫేక్‌ అకౌంట్లతో మోసాలు చేయడం, క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయమని చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేయడం వంటి ఘటనలు పెరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగాల పేరుతో జాగ్రత్త

విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో ప్రభు త్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని సూచించారు.ముందస్తు గా డబ్బులు చెల్లించాలని కోరే సంస్థలు, వ్యక్తుల తో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళలు బంగారం, చిట్‌ఫండ్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పోలీసులకు సమాచారం

ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. చీటింగ్‌ కేసులపై జిల్లా పోలీస్‌ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, మోసగాళ్లపై చట్టపరంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల అప్రమత్తతే మోసాలకు అడ్డుకట్ట వేయగలదని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement