నారాయణపేట: జోగుళాంబ జోన్–7 పోలీస్ డ్యూ టీ మీట్‌లో నారాయణపేట జిల్లా పోలీసు అధికారు లు, సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని మరో సారి చాటిచెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో వివిధ సాంకేతిక, దర్యాప్తు, ప్రత్యేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నారు. ఈ విజయాలతో నారాయణపేట జిల్లా పోలీసు శాఖ జోన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వృత్తిపరమైన శిక్షణ, అంకితభావం, సేవా తత్పరతకు నిదర్శనంగా అధికారులు, సిబ్బంది పలు విభాగాల్లో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్–క్రిమినల్ లాస్ కృష్ణా ఎస్‌ఐ ఎస్‌ఎం నవీద్ (ద్వితీయ స్థానం), ఫొటోగ్రఫీలో పీసీ సి.వెంకట్రాములు (పీఆర్‌ఓ) ప్రథమ స్థానం, వీడియోగ్రఫీలో పీసీ బి.నరేష్ (ప్రథమ స్థానం), ట్రాకింగ్‌లో పోలీస్ జాగిలం ‘రుద్ర’, హ్యాండ్లర్లు రవి, నరేందర్ (ద్వితీయ స్థానం), బాంబు డిస్పోజల్ టీమ్–రూం సెర్చ్‌లో డి.లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు (ప్రథమ స్థానం) బాంబు డిస్పోజల్–యాక్సిస్ కంట్రోల్‌లో డి.లక్ష్మీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు (ద్వితీయ స్థానం)లో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లోనూ కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది సాధించిన విజయాలు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని, పోలీసు శాఖలో ఉన్న వృత్తి నైపుణ్యం, నిరంతర శిక్షణకు ఇవి నిదర్శనమని డ్యూటీ మీట్ ఇన్‌చార్జి, మరికల్ సీఐ భగవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


