అమరచింత (ఆత్మకూర్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్‌లైన్ చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పేట జిల్లా రెవె న్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్ పట్టణంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని ఆయన తహసీల్దార్ జేకే మోహన్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్, మేనేజర్ సీత్యానాయక్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.
తప్పులు లేకుండా
ఫారాలు నింపాలి
మక్తల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయన హెల్ప్‌డెస్క్‌ను బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల ఆన్‌లైన్ నమోదు వేగంగా జరుగుతున్నా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతుందన్నారు. బీఎల్‌ఓలు ఆన్‌లైన్ మ్యాపింగ్‌లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అర్హులెవరూ ఓటరు జాబితా నుంచి తొలగించొద్దని, డబుల్ ఓట్లు, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, తహసీల్దార్ సతీస్‌కుమార్, కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి, గోవిందురావు, గోవర్ధన్, కమిషనర్ రాజయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వంచే ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ – ఐఓ ఈగా అప్‌గ్రేడ్ చేయబడిన కేజీబీవీ, నారాయ ణపేటలో 2026–27 విద్యా సంవత్సరానికి గా ను ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో మిగిలిన 10 సీట్ల భర్తీ కోసం గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ఎస్‌ఓ శ్వేత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల వి ద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి అ న్ని ఒరిజినల్ ధృవ పత్రాలతో కళాశాలకు హా జరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99129 89334 నంబరుకు సంప్రదించలన్నారు.
జోగుళాంబ క్షేత్రంపై
విస్తృత ప్రచారం
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, స్థల పురాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని హైదవ సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్ క్షేత్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపురంగా పిలువబడుతున్న దేవాలయాల ఆసలు పేరు హేమలాపురం అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హేమలపురం పేరు తెలియపరచాలనే ఆకాంక్షతో పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ సహాయ కార్యదర్శి రాఘవులు, నర్సింహ, వీరేందర్ గుప్తా, సాయిగౌడు, శ్రవణ్ కుమార్, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.


