నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్య క్షుడు జి.వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రారంభించి ఏడాది గడిచినా అనేక మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్, పేరపళ్ల రిజర్వాయర్ల పరిధిలో భూము లు కోల్పోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి అందలేదని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ సర్వస్వమైన భూములను ఇచ్చిన రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధర్మరాజు గౌడ్, గోపాల్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉద్మల్‌గిద్ద గో పాల్ మాట్లాడుతూ.. భూ ములతో పాటు పొ లాల్లో ఉన్న బోరు బా వులు, పైప్‌లైన్లు, చెట్లు వంటి ఆస్తులకు కూడా సరైన పరిహా రం చెల్లించడం లేదని ఆరోపించారు. పరిహారం ఆలస్యం కావడంతో ఇతర ప్రాంతా ల్లో భూములు కొను గోలు చేయాలనుకు న్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ లోగా భూముల ధర లు భారీగా పెరగడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల కంటే అదనంగా కాంట్రాక్టర్లు భూములను ఆక్రమిస్తున్నారంటూ ఆరోపించారు. ధర్నా అనంతరం భూనిర్వాసితులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు కేశవ్ నర్సప్ప, కృష్ణయ్య, మహేష్‌గౌడ్, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు


