చెత్తకుప్పల్లో కాదు.. ‘ఊయల’లో ఉంచండి | - | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పల్లో కాదు.. ‘ఊయల’లో ఉంచండి

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

నారాయణపేట: ఎవరైనా నవజాత శిశువును పెంచుకునే పరిస్థితిలో లేకపోతే ప్రమాదకర ప్రాంతాల్లో వదిలివేయకుండా.. నిస్సంకోచంగా జిల్లా ఆస్పత్రిలోని ‘ఊయలశ్రీలో వదిలి వెళ్లండని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ శి శువును పూర్తి బాధ్యతతో సంరక్షించి చట్టబద్ధ దత్తత ద్వారా బంగారు భవిష్యత్‌ కల్పిస్తుందని తెలి పారు. నవజాత శిశువులను చెత్తకుప్పలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి నిర్జన ప్రాంతాల్లో వదిలివేసే హృదయ విదారక ఘటనలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ఒకవైపు కొందరు నవజాత శిశువులను అనాథలుగా వదిలివేస్తుండగా.. మరోవైపు సంతానం లేని దంపతులు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ నిబంధనల ప్రకారం చట్టబద్ధ దత్తత కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఊయల కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ కాలేజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆదిత్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జయచంద్రమోహన్‌, డీసీపీఓ కరిష్మా, వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి

మద్దూర్‌ (కోస్గి): సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేయడం వల్ల రైతులు ఆధిక ఆదాయం పొందొచ్చని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రి యాంక అన్నారు. పంటల వైవిద్యీకరణలో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌రెడ్డిపల్లిలో రైతులు మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేస్తున్న వంకాయ, పచ్చిమిర్చి, టమాట, పూల తోటల సా గును క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలించారు. రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాగు విధానా లు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణ తీరుపై కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని ముక్తిపాడ్‌ రైతువేదికలో ప్రాజెక్టు కే100 ను ప్రారంభించారు. డివిజన్‌ పరిధిలోని కోస్గి, మద్దూర్‌, కొత్తపల్లి, గుండుమాల్‌ మండలాల్లోని వివిధ గ్రా మాలకు చెందిన రైతులకు సాగులో నూతన విధా నం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికా రి సక్రియానాయక్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ శ్రీధర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, హార్టికల్చ ర్‌ అధికారి హర్షవర్ధన్‌, ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయాధికారులు రేష్మారెడ్డి, రమేష్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement