నర్వ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో అక్రమంగా చేపల చెరువు నిర్మాణం జరుగుతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే సర్వేనంబర్లు 107, 108లో సుమారు 30 ఎకరాల్లో భారీఎత్తున మట్టి పనులు చేపట్టి 70 శాతం నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణాలతో 300 ఎకరాల ఆయకట్టు, తాగునీటి వనరులు, పశువుల నీటి అవసరాలు, ఉందేకోడ్‌లోని సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతినే ప్రమాదం ఉంది. చేపల చెరువు నుంచి వెలువడే కలుషిత నీరు యాంకీ చెరువులోకి చేరి నీటి నాణ్యత దెబ్బతింటుంది. సమగ్ర విచారణ జరిపి అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు విన్నవించాం.
– నర్వ, ఉందెకోడ్, యాంకి గ్రామాల ప్రజలు


