ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎస్పీ

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

నారాయణపేట: జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డా.వినీత్‌ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, పెండింగ్‌ కేసుల దర్యా ప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్‌ అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి.. బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయ న ఆదేశించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల్లో రాజీ పడొద్దని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, కమ్యూనల్‌ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని.. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తరచుగా కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి.. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్లలో సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ.. రోజూ రోల్‌కాల్‌ నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై విస్తృత ప్రచా రం నిర్వహించడంతో పాటు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను నిరంతరం పర్యవేక్షించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజుల్‌ హక్‌, డీఎస్పీలు మహేశ్‌, లింగయ్య, సీఐలు శివశంకర్‌, సైదులు, భగవంత్‌రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్యాంసుందర్‌ రాజు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement