న్యూస్‌రీల్
జిల్లాలో కానరాని వాన జాడ
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
‘ఈ ఫొటోలోని యువ రైతు పేరు రాము. మాగనూరు స్వగ్రామం. ఈ ఏడాది వానాకాలంలో 7 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పటికే రూ.2 లక్షల పెట్టుబడి అయింది. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సాగునీరు అందేది. ప్రస్తుతం జలాశయంలో లో నీరు లేదు. బోరు నుంచి వచ్చే నీరు సరిపోవడం లేదు. వర్షాలు కురవక నీరందకపోతే పంట మొత్తం దెబ్బతింటుంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ మార్గంలో సాగునీరు అందించాలని కోరుతున్నారు.


