ప్రజావాణి వినతులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి వినతులు త్వరగా పరిష్కరించాలి

Oct 13 2026 12:59 AM | Updated on Oct 13 2026 12:59 AM

మరికల్‌: మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణికి వస్తున్న వినతులను త్వరగా పరిష్కరించేందుకు అన్నిశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎంఓ ప్రజావాణి రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సహదేవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం స్థానిక మండల కాంప్లెక్స్‌లో నిర్వహించిన ప్రజావాణిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వినతులను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ప్రజావాణికి అన్నిశాఖల మండల అధికారులు విధిగా పాల్గొనాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రాంకోటి, ఎంపీడీఓ పృథ్వీ రాజ్‌, ఎస్‌ఐ రాంలాల్‌ తదితరులు ఉన్నారు.

కొనసాగుతున్న

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలు

దామరగిద్ద: మండలంలోని కాన్‌కుర్తి పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ కం సెలెక్షన్స్‌ సోమవారం రెండోరోజు కొనసాగాయి. రాష్ట్ర నలుమూలుల నుంచి వచ్చిన 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని మంగళవారంతో పోటీలు ముగుస్తాయని డీవైఎస్‌ఓ వెంకటేష్‌, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. ఆయా కేటగిరీల్లో గెలుపొందిన క్రీడాకారులు డిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో రెజ్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నర్సింహులు కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సాయినాథ్‌, కోచ్‌ శ్రీనివాస్‌, వెంకటప్ప, బాలరాజు, రాజశేఖర్‌, నర్సింహారెడ్డి, బస్వరాజ్‌, బీరప్ప, శశికాంత్‌రెడ్డి, రాజేష్‌, రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇన్‌స్పైర్‌ అవార్డులకు 428 నామినేషన్లు

నారాయణపేట ఎడ్యుకేషన్‌: ఇన్‌స్పైర్‌ అవార్డులకు జిల్లాలో 428 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు తెలిపా రు. సోమవారం జిల్లాకేంద్రంలో ఆయన మా ట్లాడారు. మొత్తం 93 పాఠశాలల నుంచి నామినేషన్లు రాగా.. అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 63, కేజీబీవీలు 12, టీజీ మోడల్‌ స్కూల్‌ 2, గురుకుల పాఠశాలలు 4, ప్రాథమికోన్నత పాఠశాలలు 3, ఉండగా.. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి కేవలం నాలుగు మాత్రమే ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

పటిష్టంగా

సమాచార హక్కు చట్టం

నారాయణపేట: పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్‌ ముదిరాజ్‌ కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఇన్‌చార్జి ఎడ్ల కురుమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌చేసి మాట్లాడారు. కొందరు అధికారులు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు సమాచారం అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు కల్పించిందన్నారు. ప్రజలు అడిగిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందిస్తూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడమే వార్షికోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్‌, జిల్లా కార్యవర్గసభ్యుడు గణేష్‌, జిల్లా కార్యదర్శి మురళి, రవినాయక్‌, కొడంగల్‌ అసెంబ్లీ ఇనన్‌చార్జి అనంతయ్య, మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగేష్‌, రాము, బాలప్ప, అంజి, ఉప్పరి నరేష్‌, రమేష్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement