జిల్లాకేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని అశోక్‌నగర్‌లో వెలిసిన మాతా మల్లాంబికాదేవి రెండోరోజు సోమవారం గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు. అలాగే ధూల్‌పేటలోని అంబాభవాని మందిరంలో అమ్మవారు ఆదిశక్తి రూపంలో, బ్రాహ్మణవాడిలో చౌడేశ్వరి మాత అర్ధనారీశ్వర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
నారాయణపేట
అర్ధనారీశ్వర అలంకరణలో చౌడేశ్వరిమాత
గాయత్రిదేవి అలంకరణలో మాతా మల్లాంబికాదేవి


