ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి

Oct 13 2026 12:59 AM | Updated on Oct 13 2026 12:59 AM

నారాయణపేట: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తగ్గుతున్న భూగర్భ జలమట్టాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు కు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.శ్రీను సూచించారు. సోమవారం మండలంలోని సింగారం రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. నీటిలభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటూ, సమగ్ర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపా రు. ప్రస్తుత వానాకాలంలో వర్షపాతం లోటు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సా గు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని 38 రైతువేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో సుమారు 4,500 మంది రైతులు, 250 మంది ప్రజాప్రతినిధు లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగు, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టాలు సగటున నాలుగు మీటర్ల మేర తగ్గిన నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. వరికి బదులు కంది, పెసర, మినుము లు, శనగలు, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు. సమగ్ర వ్యవసాయ విధానం, నీటి సంరక్షణను సమన్వయం చేసుకుంటే వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ విధానాలను అనుసరిస్తూ అదనపు ఆదాయం పొందుతున్న రైతు ప్రతాప్‌రెడ్డి అనుభవాన్ని ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియానాయక్‌, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, మార్కెట్‌ కార్యదర్శి భారతి, సింగారం సర్పంచ్‌ నాగిరెడ్డి, ఏఓ దినకర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement