ప్రజలకు పారదర్శక సేవలు అందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పారదర్శక సేవలు అందాలి

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

ఊట్కూర్‌: ప్రజలకు పోలీసుశాఖపై న మ్మకం, భద్రత, భరోసా పెంచేలా సి బ్బంది పారదర్శక సేవలు అందించాల ని ఎస్పీ డా. వినిత్‌ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ రమేశ్‌ పూ ల మొక్కలు అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి పెండింగ్‌ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల ఆన్‌లైన్‌ నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. సీసీటీఎన్‌ఎస్‌ వ్యవస్థలో కేసుల నమోదు, నిర్వహణ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, కమ్యూనల్‌ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచి విధిగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలన్నారు. ప్రతి గ్రామ పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్‌ 100 ఫిర్యాదులకు వేగంగా స్పందించి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement