● జిల్లా ప్రజావాణికి వినతుల వెల్లువ
నారాయణపేట: గోడు వినండి.. సమస్యలు పరిష్కరించండి... అంటూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఫిర్యాదుదారులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ సీహెచ్ ప్రి యాంకను స్వయంగా కలిసి వినతులు అందజేశా రు. మొత్తం 23 మంది వినతులు అందజేయగా కలెక్టర్ స్వీకరించి పరిశీలించి వారితో మాట్లాడి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును అ త్యంత ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్‌ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


