2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్‌ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం.
– మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్
సెంటర్ నిర్వాహకులు, వనపర్తి
పట్టుదలతో చేరా..
మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రా మంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్‌లో స్థానం దక్కించుకున్నాను.
– మొహిలా అలీ, కొన్నూరు,
మదనాపురం


