యూనిఫాంల తయారీ వేగవంతం : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

యూనిఫాంల తయారీ వేగవంతం : కలెక్టర్‌

Jul 12 2026 3:29 AM | Updated on Jul 12 2026 3:29 AM

అగ్నివీరులు..!

వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్‌ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్‌ (అగ్నిపథ్‌)లోకి పంపించేందుకు ఫిజికల్‌, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్‌, గబ్బర్‌సింగ్‌ ట్రైనింగ్‌ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకుల ను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇ స్తూ చైతన్యం చేస్తున్నారు.

సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్‌ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్‌.. జై కిసాన్‌.. ఫ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’ సెంటర్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో యువతకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్‌నెస్‌ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్‌ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్‌లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్‌సింగ్‌ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్‌కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై శిక్షణ ఇస్తున్నారు.

నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో అందేలా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఐదోవార్డు బాపూనగర్‌ కమ్యూనిటీ భవనంలో ఆదర్శ మహిళాశక్తి పట్టణ మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న స్కూల్‌ యూనిఫాంల తయారీని ఆమె సందర్శించి నాణ్యత, పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లాలోని మక్తల్‌, నారాయణపేట, కోస్గి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల, మైనార్టీ గురుకులాల విద్యార్థుల యూనిఫాంలు ఇక్కడే తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత పాఠశాలలకు వెంటనే పంపిణీ చేయాలని మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు.

సంస్థను ఏర్పాటు చేసి..

దేశ రక్షణకు యువత ముందడుగు

2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక

యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్‌ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ

2027 నోటిఫికేషన్‌ కోసం మరో 15 మందికి తర్ఫీదు

ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం

శిక్షణ ఉపయోగపడింది..

గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్‌ తీసుకున్న తర్వాత అగ్నివీర్‌లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది.

– రాఘవేంద్ర, ద్వారకానగర్‌, మదనాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement