విత్తన రాయితీని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విత్తన రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

నారాయణపేట రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివరెడ్డి అన్నారు. మండలంలోని జాజాపూర్‌ రైతువేదికలో మహిళా రైతులు శంకరమ్మ, సాయమ్మ, కళావతితో పాటు మరికొందరు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ పథకంలో భాగంగా మండలానికి నూజివీడు, ప్రవర్ధన్‌, రాశి కంపెనీలకు చెందిన 800 విత్తన ప్యాకెట్లు వచ్చాయని.. ప్యాకెట్‌ ధర రూ.901 ఉండగా, రాయితీ రూ.900 పోను రైతు రూపాయి మాత్రమే చెల్లించాలన్నారు. పథకంలో బయో ఫెర్టిలైజర్స్‌, బయో ఫెస్టిసైడ్స్‌, న్యూట్రియన్స్‌ రైతులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకం ఐదేళ్ల వరకు అ మలులో ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్‌, వ్యవసా య విస్తరణ అధికారులు ప్రకాష్‌, అనిల్‌కుమార్‌, రాజేష్‌, అంజమ్మ, తార, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

వేద సాగు పద్ధతి పాటించాలి..

మరికల్‌: రైతులు వేద సాగు పద్ధతిని అవలంబించడంతో విత్తనాల వినియోగం తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ అన్నారు. శుక్రవారం స్థానిక రైతువేదికలో జాతీయ ఆహార భద్రత పథకం కింద ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేద సాగు విధానంతో రైతులకు నీటి ఆదా, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చెన్నయ్య, ఏఓ రహమాన్‌, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, ఏఈఓ పరశురాం, ఆనంద్‌, హర్షవర్ధన్‌రెడ్డి, హరీశ్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement