నారాయణపేట ఎడ్యుకేషన్: పుర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా అందించేందుకు అధికారు లు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పుర చైర్‌పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ కోరారు. ఆదివారం ఉదయం మండలంలోని సింగారం సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి పంపుహౌస్‌ను ఆమె పరిశీలించారు. పంపుహౌస్ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసు ్తతం పట్టణానికి 606 ఎంఎల్‌డీ నీటి సరఫరా జరుగుతుందని.. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురపాలిక తరుఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంపుహౌస్‌ను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలని, సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
టూడేలీగ్‌లో
విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్‌సీఏ టూడేలీగ్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూడేలీగ్‌లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శన చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా, ఏకాగ్రతతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రానున్న రోజుల్లో రంజీ, భారతజట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జట్టు తన తొలి మ్యాచ్‌లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది.
ఉమ్మడి జిల్లా జట్టు ఇదే..
ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్‌నగర్), సంజయ్ (నాగర్‌కర్నూల్), అభిలాష్‌గౌడ్ (నారాయణపేట), వర్షిత్‌రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), జి.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), ముఖిత్ (మహబూబ్‌నగర్), గగన్ (నాగర్‌కర్నూల్), వెంకట్‌సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్‌నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్‌కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు.


