ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● చదువుకు దూరమైన వారికి ప్రయోజనం
● జిల్లాలో 17 అధ్యయన కేంద్రాలు
● ప్రారంభమైన ప్రవేశాలు..
ఆగస్టు 29 వరకు గడువు
–8లో u
చదువు మధ్యలో మానేసిన ప్రతి విద్యార్థిని సా ర్వత్రిక పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే నిరక్షరాస్యులను గుర్తించాం. అందరి సహకారంతో నిరక్షరాస్యులైన వయోజనులకు టెన్త్ పరీక్షలు రాయించేందుకు కృషి చేస్తున్నాం. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటి వద్దే ఉండి సెలవులో చదువుకునే వెసులుబాటు ఉంటుంది.
– శ్రీనివాస్, టాస్ కోఆర్డినేటర్,
నారాయణపేట
నారాయణపేట రూరల్: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదో తరగతి, ఇంటర్ విద్య అభ్యసించే అవకాశం కల్పించింది. 2008 నుంచి పదో తరగతి, 2009 నుంచి ఇంటర్‌లో అడ్మిషన్లు కల్పిస్తుండటంతో ఎంతో మంది ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకొని ఉపాధి మార్గాలు పొందుతున్నా రు. వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి వేదికగా నిలుస్తోంది.
ఎంతో ప్రయోజనకరం..
విద్యార్హత లేక ఎంతో మంది ఉపాధికి నోచుకోకపోవడంతో పాటు ఉద్యోగాలు సాధించిన వారు పదోన్నతికి దూరమవుతున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పూర్తిచేసి.. ఆ తర్వాత డిగ్రీ, పీజీ సైతం చేసేందుకు ఆస్కారం ఉంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు పదోన్నతులు సైతం పొందవచ్చు. ఇందులో చదువుకునే అభ్యాసకులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఆదివారం, రెండవ శనివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో 30 రోజులకు మించకుండా తరగతులు ఉంటాయి. రెగ్యులర్ విద్యతో సమానమైన బోధన లభిస్తుంది. జిల్లాలో వందలాది మంది రెగ్యులర్ విద్య కంటే సార్వత్రిక విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆగస్టు 29 వరకు గడువు..
ప్రస్తుత విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల కోసం జూన్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 28 వరకు అపరాధ రుసుం లేకుండా, ఆగస్టు 29 వరకు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాల్లో రూ.150 చెల్లించి, సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెన్త్‌కు రూ. 1,400, ఇంటర్‌కు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకు ఫీజులో రూ. 300 రాయితీ ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో అందజేస్తే సీటు కేటాయిస్తారు.


