ఎస్‌ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్‌లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్‌ఈ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని బదిలీలు చేశారని.. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆరోగ్య కారణాలు చూపడమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.


