20 రోజుల నుంచి సన్నబియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల రోజుల క్రితం సన్నబియ్యం క్వింటా రూ. 4,500 ఉండగా.. ప్రస్తుతం రూ. 5,600కు చేరుకుంది. మిల్లర్లు వ్యాపారులకే క్వింటా రూ. 5,450 చొప్పున విక్రయిస్తున్నారు. జనాలకు రూ. 5,600కు అమ్ముతున్నారు. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముందని మిల్లర్లు చెబుతున్నారు.
– శివ, కిరాణ వ్యాపారి, మరికల్
ప్రజలపై భారం తగ్గించాలి..
ప్రతి కుటుంబానికి నెలకు 25కిలోల బియ్యం అవసరం. రెండు, మూడేళ్ల క్రితం రూ. వెయ్యికే 25 కేజీల బస్తా వచ్చేంది. ప్రస్తుతం రూ. 1,350 వరకు అమ్ముతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు బ్యియం ధరలు కూడా పెరగడంతో అదనపు భారంతో అవస్థలు పడుతున్నాం. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– రఘు, మరికల్
●


