ఏటా వర్షాలు, ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేయడం కోసం ఎదురుచూస్తాం. చెరువుల్లో చేపలు పెరిగితేనే జీవనోపాధి.. ఆలస్యమైతే కూలి పనులే దిక్కు. చెరువుల్లో చేపల వేట లేకపోవడంతో చాలామంది మత్స్యకారులు ఉపాధి పనులు, వ్యవసాయ, భవన నిర్మాణ పనులకు వెళ్లాల్సి వస్తోంది. కులవృత్తిపై ఆధారపడలేని పరిస్థితి నెలకొంది.
– ప్రకాష్, మత్స్యకారుడు, ఊట్కూర్
మత్స్యకార కుటుంబాలు చేపల అమ్మకాలతో పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, అప్పుల చెల్లింపులు సాగుతాయి. సీజన్ ప్రారంభమవుతుందనే ఆశతో అనేక మంది వలలు, పడవలు సిద్ధం చేసుకుంటారు. ఇందుకోసం కొందరు అప్పులు కూడా చేస్తారు. పంపిణీ ఆలస్యమైతే మొత్తం జీవన చక్రం దెబ్బతింటుంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ చూపి త్వరగా టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు చేపట్టారు.
– కాంత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు,
మత్స్య సహకార సంఘం
జిల్లాలో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీకిగాను ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ వెలువడనుంది. వర్షాలు పడితే ఆగష్టు, సెప్టెంబర్‌లో చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు సిద్ధంగా ఉన్నాం.
– రహమాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి
●


