నర్వ: రైతులు తమ పొలాల్లోని మట్టి పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లాలో ఉన్న అతి తక్కువ భూసార పరీక్ష కేంద్రాలతో అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మినీ భూసార పరీక్షా కేంద్రాలను గతంలో మంజూరు చేసింది. ఈ కేంద్రాల్లో ఆయా గ్రామాల్లో సేకరించిన మట్టి నమూనాలను అక్కడే పరీక్షించి రైతులకు భూ సార పరీక్ష పత్రాలు అందజేయాలని ఆదేశించింది.
జిల్లాలోని 77 క్లస్టర్లలో..
2018లో జిల్లా వ్యవసాయశాఖ ద్వారా ఏఈఓల క్లస్టర్ల వారీగా 77 మినీ భూసార పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మట్టి పరీక్షల నిమిత్తం వినియోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయక నేటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించేందుకు కిట్లున్న కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక జడ్చర్ల ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదని రైతులు చెబుతున్నారు.
అటకెక్కిన కిట్లు..
ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టిని సేకరించి కొన్నాళ్ల పాటు సజావుగా పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను రైతులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోపు భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు భాగానే ఉన్నా.. గత కొన్నేళ్లుగా భూసార పరీక్షల ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
పాత పద్ధతిలో సాగు.. రైతులకు నష్టాలు
2018లో మంజూరు.. ఒక్కో కేంద్రానికి రూ.1.30 లక్షలు మంజూరు
ప్రారంభం ఘనం.. ఆపై సేవలు కనం
నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం


