రైతువేదికలో ఏర్పాటు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

రైతువేదికలో ఏర్పాటు చేయాలి..

Jun 29 2026 2:11 AM | Updated on Jun 29 2026 2:11 AM

గతంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతువేదికల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫలితంగా పంటల సాగులో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది.

– మారుతి, రైతు, నాగిరెడ్డిపల్లి

ఉన్నతాధికారులకు విన్నవిస్తాం..

రైతులు ప్రతి మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. దీంతో 2018లో ఏఈఓల క్లస్టర్ల వారీగా నాటి ప్రభుత్వం మినీ కేంద్రాలను మంజూరు చేసింది. ఆయా కేంద్రాలకు రసాయనాలు, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా నిలిచిపోయింది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులు జడ్చర్ల ల్యాబ్‌లో నామినల్‌ ఫీజు చెల్లించి భూసార పరీక్షలు చేయించుకోవచ్చు.

– నాగేష్‌, ఏడీఏ, మక్తల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement