రద్దు చేసినా.. మళ్లీ డిప్యూటేషన్
సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2019 నుంచి డిప్యూటేషన్‌పై డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా.. 2023–24 విద్యాసంవత్సరంలో అతడి వ్యవహారశైలి చూసి అప్పటి కలెక్టర్ డిప్యూటేషన్ రద్దు చేశారు. ఆ తర్వాత ఆ కలెక్టర్ బదిలీ కాగా.. కొన్ని రోజుల తర్వాత 2024–25 విద్యాసంవత్సరంలో తన పలుకుబడితో డీఈఓ కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకున్నాడు. ప్రభుత్వ కొలువులో ఉండి వేతనం తీసుకుంటూనే యథావిధిగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అన్నీ తానై చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.
పైరవీలు (కేరాఫ్) డీఈఓ ఆఫీస్
డిప్యూటేషన్‌పై వచ్చిన
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి దందా
కార్యాలయం నుంచే ‘ప్రైవేట్’ వ్యవహారాల దిద్దుబాటు
పలు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణలో కీలకపాత్ర
గత కలెక్టర్ రద్దు చేసినా.. మళ్లీ అదే స్థానంలోకి..
నారాయణపేట జిల్లా విద్యాశాఖపై విమర్శలు


