నిర్మాణం.. వివాదాస్పదం! | - | Sakshi
Sakshi News home page

నిర్మాణం.. వివాదాస్పదం!

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

వ్యాపారులకు అంతరాయం..

మార్కెట్‌యార్డులో సా..గుతున్న షెడ్‌ నిర్మాణం

–8లో u

పనులు నత్తనడకన సాగుతుండటంపై రైతులు, కమిషనన్‌ ఏజెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి సుమారు రెండు నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో సాగడం లేదని చెబుతున్నారు. వచ్చే సీజనన్‌ వరకు పనులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్‌ కోసం పిల్లర్లు నిర్మించడంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ఎదుటే పిల్లర్లు ఉండటంతో రైతులు ధాన్యం తీసుకొచ్చిన వాహనాలు నిలపడం, ఉత్పత్తులు దించుకోవడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. నిర్మాణంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి రాకూడదని వారు కోరుతున్నారు.

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న కవర్‌ షెడ్‌ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మరోవైపు నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం 9 నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి చూ స్తే గడువులోగా కష్టమేనన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేపట్టాల్సి ఉండగా.. మార్కెట్‌ కమిటీ చైర్మనే సబ్‌ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం, డిజైనన్‌పై వివాదం కొనసాగుతుండగా.. పనుల నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఎత్తు తగ్గించారా..?

షెడ్‌ ఎత్తు తగ్గించేందుకు నష్టపరిహారం పేరిట కమిషన్‌ ఏజెంట్ల నుంచి డబ్బులు వసూలు చేశారన్న వ్యవహారం మార్కెట్‌యార్డులో తీవ్ర చర్చకు దారితీసింది. షెడ్‌ నిర్మాణంతో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు దుకాణదారులు జూన్‌ 6న మార్కెట్‌ కమిటీ చైర్మనన్‌ ఆర్‌.శివారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పనులను పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. సరి చేసేందుకు అయ్యే ఖర్చును దుకాణ యజమానులే భరించాల్సి ఉంటుందని.. ఒక్కొక్కరు రూ.5 వేలు ఇవ్వాలని కోరగా, చివరకు సుమారు 10 మంది దుకాణదారులు ఒక్కొక్కరు రూ.3 వేల చొప్పున ఇచ్చిన తర్వాతే ఎత్తు తగ్గించారనే చర్చ బహిరంగంగా సాగుతోంది.

అధికారుల పర్యవేక్షణ కరువు..

రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న షెడ్‌ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ అధికారుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం పనులు చూసి వెళ్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారంపై చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దుకాణాల ఎదుటే పిల్లర్ల నిర్మాణం, ఎత్తులో మార్పులు, పనుల జాప్యం, డిజైన్‌పై అభ్యంతరాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనంతో చేపట్టిన పనుల్లో నాణ్యత, పారదర్శకత, వేగం అన్నింటినీ అధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యతను మరిచారన్నది కానవస్తుంది.

రూ.2.40 కోట్లతో పనులు

వ్యాపారానికి అడ్డంకిగా

మారిందంటున్న ఏజెంట్లు

సబ్‌ కాంట్రాక్టర్‌గా మారిన

మార్కెట్‌ చైర్మన్‌?

తూతూమంత్రంగా అధికారుల పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement