మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం నగరంలోని లక్ష్మీనగర్ వద్ద మెయిన్‌రోడ్డుపై శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఆర్చ్‌ను ప్రారంభించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నామన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.


