ఆన్‌లైన్‌ నమోదులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ నమోదులో వేగం పెంచాలి

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

నారాయణపేట రూరల్‌/మరికల్‌: ఓటర్ల నుంచి పూరించిన ఎన్యూమరేషన్‌ పత్రాలను సేకరించి, వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని చిన్నజట్రం, కొల్లంపల్లి, లింగంపల్లి, మరికల్‌ మండల కేంద్రంతో పాటు అప్పంపల్లి గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించి బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్ల పనితీరు, జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎన్ని ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు.. అందులో ఎన్ని పత్రాలు తిరిగి తీసుకున్నారు.. ఇంకా ఎన్ని తీసుకోవాల్సి ఉందనే వివరాలను ఆయా బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్‌ పత్రాలను నింపి బీఎల్‌ఓలకు తిరిగి ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని, ఇవ్వకపోతే జాబితాలో పేరు ఉండదు అని ఆమె స్పష్టం చేశారు. చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్‌ ఓట్లు తొలగించాలన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు అమరేంద్ర కృష్ణ, రాంకోటి, ఎంపీడీఓ పృథ్వీరాజ్‌, సిబ్బంది వెంకటప్ప, జ్యోతి, సూపర్‌వైజర్లు ఆంజనేయులు గౌడ్‌, బాలాజీ, కార్యదర్శులు సుజాత, ఎండీ ఖదీర్‌, విజయ్‌, సర్పంచులు జ్యోతి నాగేష్‌, మణెమ్మ బాలప్ప, భాగ్య జగన్‌, బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement