జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్‌లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్‌ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్‌తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.


