10న తేజస్‌ స్టార్టప్‌ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

10న తేజస్‌ స్టార్టప్‌ వర్క్‌షాప్‌

Jul 5 2026 8:02 AM | Updated on Jul 5 2026 8:02 AM

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 10న తేజస్‌ స్టార్టప్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ టి.రామలింగేశ్వర్‌గౌడ్‌ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్‌ ఇండియా, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, తెలంగాణ పరిశ్రమలశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కొనసాగే వర్క్‌షాప్‌ను యువత, విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్క్‌షాప్‌లో స్టార్టప్‌ ఏర్పాటు విధానం, వ్యాపార ఆలోచనల పరిశీలన (ఐడియా వ్యాలిడేషన్‌), మెంటర్‌షిప్‌, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, నిధుల సమీకరణ (ఫండింగ్‌), నెట్‌వర్కింగ్‌ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు గూగుల్‌ ఫాంలో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 62819 94436 సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement