నిండు జీవితానికి రెండు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

నిండు జీవితానికి రెండు చుక్కలు

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

నేడు పల్స్‌ పోలియో

జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాలు.. 53,666 మంది చిన్నారులు

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణానికిగాను ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాల్లో 53,666 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 72 వేల డోసులను అందుబాటులో ఉంచగా.. 1,880 మంది వైద్యసిబ్బందిని విధుల్లో నియమించారు. వీరిలో వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ప్రయాణాల్లో ఉండే చిన్నారులకు కూడా పోలియో చుక్కలు మిస్‌ కాకుండా 12 మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాపరిధిలోని 5 ప్రధాన బస్టాండ్లలో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే చిన్నారులకు కూడా చుక్కలు వేయనున్నారు.

● కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లాను 40 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు 45 మంది సూపర్‌వైజర్లను నియమించారు. వ్యాక్సిన్‌ నిల్వలు, బూత్‌ల నిర్వహణ, లక్ష్యసాధన తదితర అంశాలను వీరు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఆదివారం బూత్‌లలో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి తర్వాతి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి అందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

మండలాల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులు

మండలం చిన్నారుల

సంఖ్య

నారాయణపేట 8,921

గుండుమాల్‌ 7,562

మద్దూరు 6,835

మక్తల్‌ 6,669

దామరగిద్ద 5,379

మాగనూరు 5,040

ఊట్కూర్‌ 4,622

నర్వ 3,664

ధన్వాడ 2,190

మరికల్‌ 2,784

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement