మక్తల్: పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేమస్వామి ఆలయం వద్ద నిర్మిస్తున్న రాజగోపురం పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మత్య్సశాఖ, క్రీడల, యువజన శాఖల మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం పడమటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి రా జగోపురం నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 60 లక్షలతో పనులకు టెండర్ పూర్తైనా.. పనులు ఎందుకు ఆలస్యం అయ్యాయని ఇంజినీర్, కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో నిర్వహించే ఉత్సవాల వరకు రాజగోపురం పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల వనరులు ఉన్నాయని, అందరి తోడ్పా టు అవసరమన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రాణేశ్‌చారి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేశ్‌కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


