బాలానగర్‌లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్‌గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి.
– శేఖర్‌రెడ్డి, వాహనదారు
బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్


