నారాయణపేట: జిల్లాలో పనిచేస్తున్న ఆధార్ ఆపరేటర్లు యూఐడీఏఐ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేస్తూ.. ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలని యూఐడీఏఐ రాష్ట్ర మేనేజర్ నరేశ్‌చంద్ర అన్నారు. ఆధార్ నమోదు, నవీకరణ సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆధార్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ నమోదు, అప్‌డేట్, ఈ–ప్రాసెస్, బయోమెట్రిక్ ధ్రువపత్రాల పరి శీలన, సేవల నాణ్యత ప్రమాణాలపై సవివరంగా వివరించారు. ప్రతి ఆధార్ కేంద్రంలో యూ ఐడీఏఐ నిబంధనల మేరకు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఈడీఎం కె.విజయ్ కుమార్, జిల్లా మేనేజర్ కె.రామ్మోహన్, శివప్రసాద్ పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యమే
భవిష్యత్‌కు పునాది
నారాయణపేట: పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. నులిపురుగుల నివారణతో వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బాటలు వేయవచ్చని మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత, వైస్‌చైర్‌పర్సన్ మంజుల అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.సిద్ధప్పతో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా.. తమ పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని సూచించారు. ప్రతి చిన్నారికి ఆరోగ్యవంతమైన భవిష్యత్ అందించడంలో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. కాగా, జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన 1,52,355 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. కాగా, మరికల్ గురుకుల పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్ పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత, వైద్యసేవల అమలును పరిశీలించారు. కార్యక్రమంలో డీఐఓ డా.సాయిరాం, ఎన్‌సీడీ పీఓ డా. లక్ష్మీకాంత్, ఎన్‌టీఈపీ పీఓ డా.సత్యప్రకాశ్‌రెడ్డి, ఎంహెచ్‌ఎన్ పీఓ డా.సుదీష్ణ, కోఆర్డినేటర్ సురేశ్‌బాబు, యూపీహెచ్‌సీ వైద్యాఽ దికారి డా.తిరుపతి పాల్గొన్నారు.


