హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్‌–44పై అండర్‌ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్‌–44పై అండర్‌ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

మ్మడి జిల్లాలో ఎన్‌హెచ్‌–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్‌ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్‌ వరకు ఎన్‌హెచ్‌–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్‌ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని బాలానగర్‌, రాజాపూర్‌, భూత్పూర్‌ మండలం శేర్‌పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్‌ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్‌ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్‌, రాజాపూర్‌, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్‌ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రతినిత్యం వేలాది వాహనాలు.. వందకుపైగా వేగంతో రయ్యుమంటూ దూసుకెళ్లే జాతీయ రహదారి –44పై బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్‌ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిపై అక్కడక్కడ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో

ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ఒకే దారిలో ఇరువైపుల వాహనాలు వస్తుండటంతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు, అధికారిక విధుల్లో వెళ్లేవారు, ప్రయాణికులు

అష్టకష్టాలు పడుతున్నారు. – అడ్డాకుల/రాజాపూర్‌

బాలానగర్‌, రాజాపూర్‌ వద్ద

నిత్యం ట్రాఫిక్‌ కష్టాలు

వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు

హైదరాబాద్‌ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం

గంటల తరబడి ట్రాఫిక్‌లో

చిక్కుకొని వాహనదారుల అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement