నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే పోలీసు శాఖ నిరంత రం పనిచేస్తోందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ‘డ యల్ యువర్ ఎస్పీ‘ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గంట వ్యవధిలో 25 మంది బాధితులు, ఫిర్యాదుదారులు నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి తమ సమస్య లను వివరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడుతామని ఎస్పీ భరోసానిచ్చా రు. ప్రజలు ప్రధానంగా గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, అక్రమ మద్యం, పాన్ షాపుల్లో గుట్కా విక్రయాలు, భూ వివాదాలు, ట్రాఫిక్ సమస్యలు, మందుబాబుల అరాచకాలు, ఎస్‌ఐ ఫిర్యాదు స్వీకరించలేదనే ఆరోపణలు, కానిస్టేబుల్ భూ వివాదాల్లో జోక్యం, పెండింగ్ చోరీ కేసుల దర్యాప్తు, బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించడం, రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంపు, చీటింగ్ కేసులు తదితర అంశాలపై ఫిర్యాదు లు చేశారు. మరికల్ మండలం తీలేరు గేట్ వద్ద ప్రమాదాల ని వారణకు భారీకేడ్లు ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లు అమర్చాలని ప్రజలు కోరారు. నారాయణపేట పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్, యా ద్గిరి రోడ్, స రాఫ్ బజార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించే చర్య లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ చేస్తాం
ఊట్కూర్‌లో రౌడీ షీటర్లు, క మ్యూనల్ షీటర్ల జాబితాలో ప్ర మేయం లేని వ్యక్తుల పేర్లు ఉన్నాయనే ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ సమగ్ర విచారణ జరిపి అలాంటి వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. మక్తల్‌లో మిస్సింగ్ కారు, వెండి ఆభరణాల చోరీ, మద్దూరులో బెల్ట్ షాపులు, ఓపెన్ డ్రింకింగ్, గొర్రెల చోరీ, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఫోన్ కాల్స్‌లో ఫిర్యాదులు
స్వీకరిస్తున్న ఎస్పీ డాక్టర్ వినీత్


