మరికల్: ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు అంకితభావంతో వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. రవీందర్‌నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తీలేరులో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, మరికల్ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్స్‌పోలియో కార్య క్రమ అమలు, ఇంటింటి సర్వే, సీజనల్ వ్యాఽ దుల నివారణకు చేపట్టిన చర్యలను వైద్యుల తో ఆరా తీశారు. అలాగే మరికల్ పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ, ప్రసూతి గది, ప్రయోగశాలతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులు అందుబాటులో ఉండి రోజులకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. మరికల్ పీహెచ్‌సీలో రోగులకు అందు తున్న వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేసి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్దప్ప, ప్రోగ్రామ్ అధికారి సాయి రాం, డా. రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


