మక్తల్: రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు మక్తల్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం పట్టణంలోని ఎల్లమ్మకుంటలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి గోపాలం ప్రారంభించారు. పోటీల్లో 76 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మక్తల్‌కు చెందిన అర్జున్‌కుమార్, అక్షయ్‌కుమార్, వెంకటేష్, రమేష్, గోపీచంద్, లోకేష్, శ్రీనాథ్, జనార్ధన్, వేణుగోపాల్, విఘ్నేష్, మనోహర్, అభిలాష్, ఆకాష్, మహేష్, అశోక్, పురుషోత్తం, వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ నెల 20న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఆయా క్రీడాకారులు పాల్గొంటారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు రేణుక, మీనాకుమారి, అంబ్రేష్, చంద్రకళ, శివకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, దామోదర్, స్వప్న, బోయ లలిత, అవంతి, యాదగిరి, బుడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.


