నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ఎమ్మార్పీలు కృషి చేయాల ని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో నిర్వహిస్తున్న ప్రాథమికస్థాయి మండల రిసోర్సు పర్సన్ల జిల్లాస్థాయి శిక్షణకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయుల శిక్షణే పునాది అన్నారు. ఎంఆర్పీలు తమ మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా తరగతి గదిలో ప్రభావవంతంగా అమలవుతుందా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు టీచర్స్ హ్యాండ్‌బుక్ ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందించి బోధించేలా మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల వర్క్‌బుక్స్ క్రమం తప్పకుండా పరిశీలించి దిద్ధుబాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పాఠశాలలో భాషా, గణిత, ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టిసారించి తరగతి గదిలో అందుబాటులో ఉన్న టీఎల్‌ఎంను సృజనాత్మకంగా వినియోగించాలని సూచించారు. ఏఎక్స్‌ల్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ నేర్చుకునే స్థాయిల ఆధారంగా విద్యార్థులను గుర్తించి లక్ష్యా ఉద్ధేశంతో బోధన నిర్వహించాలన్నారు. బోధన, సమూహ అభ్యాసం, నిరంతర మూల్యాంకనం ద్వారా ప్రతి విద్యార్ధిని ఆశించిన అభ్యాసన స్థాయికి తీసుకురావాలని కోరా రు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, జిల్లాసా యి శిక్షకులు భీమప్ప, జానకిరాములు, వినోద్, అఖిల్, లక్ష్మీనారాయణ, నరేష్ పాల్గొన్నారు.


