జిల్లాలో 1.67 లక్షల మంది రైతులకు పెట్టుబడి సా యం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఇప్పటికే రూ.189.91 కోట్లు చెల్లించాం. మిగిలిన రైతులకు కూడా విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తాం. రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు.
– సక్రియా నాయక్, డీఏఓ, నారాయణపేట
●
అర్హులైన రైతుల ఖాతాల్లో విడతల వారీగా రైతు భరోసా పథకం కింద నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,67,678 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.189.91 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 152 మంది రైతులకు సంబంధించిన రూ.16. 93 లక్షల డీబీటీ చెల్లింపులు విఫలం కాగా.. అత్యధికంగా నర్వ మండలంలో 23 మందికి చెందిన రూ.2.84 లక్షలు నిలిచిపోయాయి. బ్యాంకు ఖాతాల ధృవీకరణ, ఈ–కేవైసీ, ఆధార్ అనుసంధానం పూర్తిచేసుకున్న రైతులకు ప్రాధాన్యంగా చెల్లింపులు కొనసాగుతున్నాయి. మక్తల్ మండలంలో అత్యధికంగా 20,039 మంది రైతుల ఖాతాల్లో రూ.25.61 కోట్లు జమయ్యాయి.


