జలం.. కలుషితం! | - | Sakshi
Sakshi News home page

జలం.. కలుషితం!

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

పంచాయతీలే

కొనుగోలు చేయాలి..

నిధులు ఖర్చు చేసినా..

పరీక్షలు చేయకుండానే గ్రామాల్లో నీటి సరఫరా

వర్షాకాలం.. ముంచుకొస్తున్న ముప్పు

అటకెక్కిన పరీక్షల కిట్లు

స్పందించని అధికారులు

–8లో u

మరికల్‌: గ్రామాల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీలు, పైపులైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలోని పలు మండల్లాలో కలుషిత నీరు సరఫరా అవుతున్న విషయా న్ని ఇటీవల సంబంధిత అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. అరకొరగా సరఫరా చేస్తున్న నీరైనా స్వచ్ఛంగా లేకపోవడంతో ప్రజలు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. కొళాయిల ద్వారా వచ్చే నీటి ని పరీక్షించేందుకు క్లోరింగ్‌ కిట్లు ఉపయోగపడుతా యి. ఇందుకుగాను సంబంధితశాఖ అధికారులు అన్ని పంచాయతీలకు గతంలో కిట్లు అందజేసింది. వీటిన్ని శిక్షణ పొందిన సిబ్బందితో సక్రమంగా నీటి పరీక్షలు చేయిస్తే శుద్ధమైన నీటిని సరఫరా చేయ వచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో 280 గ్రామాలు..

జిల్లావ్యాప్తంగా 280 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో క్లోరింగ్‌ కిట్లు ఉండాలి. కానీ వీటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. వర్షాకాలం ప్రారంభంలో గ్రామాల్లోని ప్రజా కొళాయిలు, సోర్సు బోర్లు, బావుల దగ్గర క్లోరింగ్‌ కిట్లతో నీటి పరీక్షలు చేసిన తర్వాతే సరఫరా చేయాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్కరోజు కూడా సిబ్బంది పరీక్షలు చేసిన దాఖా లాలు లేవు. ఒకవేళ చేసినా అవి మూడుసార్ల కంటే ఎక్కువగా పని చేయడం లేదు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కిట్లు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో మూలనపడేశారు. శుద్ధమైన నీటినే ప్రజలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో తాగునీటి పరీక్ష కిట్లను పంచాయతీలకు అందజేసినా.. ఫలితం లేకపోవడంతో కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. క్లోరింగ్‌ కిట్లను ఏటా పంచాయతీలకు అందజేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నా.. వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణాలు వినిపిస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభంలో తప్పనిసరిగా క్లోరింగ్‌ కిట్లతో నీటి పరీక్షలు చేయాలి. పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్‌ శాతం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి గతంలో ప్రభుత్వం కిట్లను అందజేసింది. ప్రస్తుతం కిట్లు అందుబాటులో లేకుంటే గ్రామపంచాయతీ నిధులతో కొనుగోలు చేసుకోవాలి. ఇప్పటికే ప్రతి పంచాయతీలో ఒకరిని గుర్తించి నీటి పరీక్షలు చేసే విధానంపై శిక్షణ ఇప్పించాం.

– రంగారావు,

ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, నారాయణపేట

రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి గ్రామాలకు నీటి పరీక్షల కిట్లను అందజేస్తోంది. అంతేగాకుండా గ్రామపంచాయతీలోని తాగునీటి సరఫరా సిబ్బందికి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడకూడా పరీక్షించిన దాఖలాలు కనిపించడం లేదు. బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచూ పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement