ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

Jun 30 2026 3:11 AM | Updated on Jun 30 2026 3:11 AM

కోస్గి రూరల్‌: లబ్ధిదారులకు భరోసా కల్పించి మొదటి విడత గ్రామాలకు ఇచ్చిన లక్ష్యం మేర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. సోమవారం గుండుమాల్‌ రైతువేధికలో కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి, గుండుమాల్‌, కొత్తపల్లి, మద్దూర్‌ మండలాల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్‌పై శ్రద్ధ వహించాలని.. ఎస్బీఎం నిధులు రూ.3 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి మండలానికి రెండు కమ్యూనిటీ మరుగు దొడ్లు మంజూరయ్యాయని.. నిర్మాణాలు చేపట్టాలని,జనావాసం ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో రూ.5 లక్షలతో కాంప్లెక్స్‌లను నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్‌పీఓ ఉదయ్‌కుమార్‌, ఎంపీడీఓ లు శ్రీధర్‌, వేణుగోపాల్‌రెడ్డి, కొండన్న, భార్గవరాం, హౌసింగ్‌ ఏఈ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement