నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్‌వర్క్ నుంచి ఇంటర్‌నెట్‌కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్‌లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్‌లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.


