జడ్చర్ల టౌన్: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిరంలో ఉమ్మడి జిల్లాలోని సరస్వతి శిశుమందిరాల మాతాజీలు, ఆచార్యులకు నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన హాజరైన మాట్లాడారు. తరచూ పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించటంతో విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశాలుంటాయన్నారు. సమావేశంలో పాలమూరు విభాగ్ మద్ది అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, అధ్యక్షుడు బాలరాజు, సహ కార్యదర్శులు కృష్ణమోహన్, విఠలయ్య, ప్రధానాచార్యులు వెంకటయ్య పాల్గొన్నారు.


