నాణ్యమైన చేనేత ఉత్పత్తులపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన చేనేత ఉత్పత్తులపై దృష్టి

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

‘రైతునేస్తం’ కార్యక్రమానికి హాజరు..

నారాయణపేట: మార్కెట్‌ అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో సెంటర్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ ఎక్సలెన్‌న్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ పురోగతిపై జరిగిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. వీవర్లు, మాస్టర్‌ వీవర్లు ఎదుర్కొంటున్న ముడి సరుకుల కొరత, మార్కెటింగ్‌ సమస్యలు, ఉపాధి అవకాశాలు, డిజైన్‌ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. హ్యాండ్లూమ్‌ ఉత్పత్తుల విక్రయాలను విస్తరించేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోలు, ప్రదర్శనలు, ఇతర మార్కెటింగ్‌ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీవర్ల సమస్యలను కలెక్టర్‌ శ్రద్ధగా విని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు హ్యాండ్లూమ్‌ డైరెక్టర్‌ ద్వారక, జిల్లా హ్యాండ్లూమ్‌ అధికారి రాజేష్‌, డీఆర్డీఓ వెంకట్రాములు తదితరులు ప్రభుత్వ పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్‌ అవకాశాలపై వీవర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో చేనేతశాఖ అధికారులు, వీవర్లు, మాస్టర్‌ వీవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌: మండలంలోని నిడుగుర్తి రైతువేధికలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక రైతులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, సర్పంచ్‌ రాములు, ఏఓ గణేశ్‌రెడ్డి, ఏఏఓ ప్రశాంతి, తిప్రాస్‌పల్లి, బాపూర్‌, పెద్దజట్రం, లక్ష్మీపల్లి, మొగ్దుంపూర్‌ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement