భూ నష్టపరిహారం పెంచి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

భూ నష్టపరిహారం పెంచి ఇవ్వాలి

Jul 19 2026 2:08 AM | Updated on Jul 19 2026 2:08 AM

కోస్గి రూరల్‌: జాతీయ రహదారిని అనుసరించి ఉన్న నాచారం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.60 లక్షలు, తోగాపూర్‌ నిర్వాసితులకు రూ.40 లక్షలు ఇవ్వాలని బాధితులు ఆర్డీఓ రమేష్‌కు విన్నవించారు. శనివారం కోస్గిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో నారాయణపేట రేడియల్‌ రోడ్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో ఐదోసారి గ్రామసభ నిర్వహించారు. నాచారంలో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, తోగాపూర్‌లో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించిందని ఆ మేరకే చెల్లిస్తుందని తెలిపారు. ఈ నెల 21న నారాయణపేట కలెక్టరేట్‌లో సమావేశం ఉంటుందని.. బాధితులు పాల్గొని తమ అభిప్రాయాలను కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు. గ్రామసభలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌ఐ సుభాష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ భీమమ్మ, సర్పంచ్‌లు రేణుక, శ్రీనివాస్‌, జీపీఓలు సత్యనారాయణ, అంజప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement