సాక్షి, హైదరాబాద్: ‘నేను, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకే కుటుంబం కాదు. మేమిద్దరం అన్నదమ్ములమైనా మా కుటుంబాలు వేరు. నాకు పదవులు అడుక్కోవడం తెలియదు. కొట్లాడటమే నా తత్వం’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే (ఉత్తమ్, పద్మారెడ్డి) ఒక కుటుంబం అవుతారని, కానీ నా ఫ్యామిలీ నాది, వెంకట్‌రెడ్డి ఫ్యామిలీ ఆయనదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసి ఉపఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు.
‘ఎన్నికల ముందు మంత్రి పదవులిస్తామని హామీ పొందిన వారిలో జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మలకు న్యాయం చేశారు. నా విషయంలోనే ఏఐసీసీ హామీ నెరవేర్చలేదు’అని మరోసారి వివరించారు. ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే రాజగోపాల్‌రెడ్డి లైన్ అని స్పష్టంచేశారు. రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పారీ్టలో మరోసారి చర్చకు దారితీశాయి.


