మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గణపతినగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన వకలగాడి తేజస్విని (27) మూడు నెలలుగా తల్లి అరుణతో కలిసి శంకర్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె తండ్రి ఈశ్వర్‌రావు విశాఖ పట్నంలో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా బయటకి వెళ్లిన తేజస్విని.. సమీపంలోని బీరప్ప ఆలయం లోపలకు వెళ్లింది. అనంతరం ఆలయంలోని విగ్రహం తీసుకునివెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం యువతి మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లి ఫిర్యాదుతో కేసు న మోదు చేశారు. తేజస్విని గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, యువతి తీసుకెళ్లిన విగ్రహం కోసం హైడ్రా బృందం ప్రత్యేక పరికరాలతో చెరువులో ముమ్మరంగా అన్వేషణ సాగిస్తోంది.
🚨 Running Naked in the Streets at Midnight, Then Jumping Into a Lake
🚨 Tragic Suicide of a Young Woman Causes Stir in Medipally, Telangana.
"Here is the full story, unfolded" ✍🏻
***Disturbing Visuals***
A software job at a young age, earning a salary in the lakhs—her happy… pic.twitter.com/1xh7FjBXpf— Vamshi (@vamshi020693) July 19, 2026


