రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జూలై 5 వరకు కంది, పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. ఆశించిన మేర వరా్షాలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు విత్తడం ప్రారంభించాలి. సరిపడా తేమ లేకుండా తొందరపడి విత్తనాలు వేయొద్దు. భూమిలో తగినంత తేమ వచ్చిన తర్వాతే సాగు పనులు చేపట్టాలి. వరి సాగు చేయాలనుకునే రైతులు ప్రస్తుతం నారుమడులు (నార్లు) పోసుకోవచ్చు. తగిన వర్షపాతం నమోదైన తర్వాత ప్రధాన పొలాల్లో నాట్లు వేయాలి. వాతావరణ పరిస్థితులు గమనిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి


