18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Jul 15 2026 2:10 AM | Updated on Jul 15 2026 2:10 AM

నారాయణపేట: చెక్‌బౌన్స్‌ కేసులకు వేగంగా, శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ నెల 18, నవంబర్‌ 21 తేదీల్లో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ తెలిపారు. జిల్లా ప్రధా న న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తు లు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టుతో పాటు నారాయణపేట, మక్తల్‌, కోస్గి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టుల్లో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 152 పెండింగ్‌ కేసులను గుర్తించి రాజీమార్గంలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్‌ సంస్థలు, న్యాయవాదులు, పోలీసుశాఖ, బీమా సంస్థలు సమన్వయంతో పనిచేసి అధికసంఖ్యలో కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కక్షిదారులు తమ న్యాయవాదులతో కలిసి సంబంధిత కోర్టులకు హాజరై లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. న్యాయసాయం, లోక్‌అదాలత్‌కు సంబంధించిన వివరాల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, టోల్‌ఫ్రీ నంబర్‌ 15100కు కాల్‌చేసి ఉచిత న్యాయ సలహాలు, సమాచారం పొందవచ్చని తెలిపారు. సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి మనోజ్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి అవినాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement